ಹನುಮಾನ್ ಚಾಲೀಸಾ ಸಾಹಿತ್ಯದ ಮಹತ್ವ ಮತ್ತು ಪ್ರಯೋಜನಗಳು
హనుమాన్ చాలీసా
“చాలీసా” అనే ప్రయోగం “చాలీస్” అనే పదం నుంచి వచ్చింది, చాలీస్ అంటే నలభై అని అర్థం. చాలీసా అనేది 40 పంక్తుల స్తుతి, దేవుని పట్ల భక్తిని వెల్లడించేది, ఆ స్వరూపాన్ని గొప్పగా చేసిన చర్యలని, సాధనలని వివరిస్తుంది.
హనుమాన్ చాలీసాని తులసీదాస్ సుందరంగా రచించేరు.
హనుమాన్ చాలీసా హారతి
హనుమంతుడు బలానికి, అత్యంత భక్తికి, భద్రతకి ప్రతిరూపం. దుష్టశక్తుల నుంచి కాపాడే వానిగా పరగణించే హనుమంతుడిని మంగళవారం, శనివారాల్లో ప్రత్యేకంగా పూజిస్తారు. హనుమాన్ చాలీసా అనేది హనుమంతుడిని స్తుతిస్తూ, మనం అందరం ఆయన మీద ఎలా తిరుగులేని విశ్వాసాన్ని వుంచాలో చెబుతుంది. ఇతరులకోసం బతుకుతూ, ప్రపంచంలో మంచిని రక్షించి, కాపాడాలని ఆయన మనకి గుర్తుచేస్తుంటారు.
రామాయణంలో హనుమంతుడు
హనుమంతుడు, రామాయణంలో మనకి కనిపించే అత్యంత వినమ్రమైన, అత్యంత శక్తివంతమైన పాత్ర అయినప్పటికీ, కొన్నిసార్లు ఆయన తన శక్తిసామర్థ్యాలని మరిచిపోతుంటారు. మనుషులుగా మన శక్తిసామర్థ్యాలని మనం తెలుసుకోకుండా, పట్టించుకోకుండా వున్నామన్న విషయం హిందూ పురాణాల్లో ఇలాటి పాత్రలో ప్రతిఫలింపజేసేరు. మనం మనలోకి తొంగిచూసుకుని, మన జీవిత మార్గాల ద్వారా మన శక్తిసామర్థ్యాలని కనిపెట్టోకవాల్సి వుంటుంది.
హనుమాన్ చాలీసా కావ్యం
హనుమాన్ చాలీసా గేయపద్యాలు పవిత్ర గ్రంథాల రూపంలోనూ, అలాగే ఇంటర్నెట్ లోనూ సిద్ధంగా అందుబాటులో వున్నాయి. హనుమాన్ చాలీసాని భక్తితో, ప్రపంచంమీద ప్రేమతో, గుండెనిండా సామరస్యంతో పఠించాలి. ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, దేవాలయాన్ని (లేదా మీరు పూజచేసే ఏదైనా ప్రదేశాన్ని) శుభ్రం చేయడం ద్వారా మీరు గౌరవాన్ని ప్రదర్శించడంతో ప్రారంభించాలి. తరవాత స్వచ్ఛమైన మనసుతో కూర్చుని, చేతులు జోడించి, దేవునిపట్ల మీ ప్రేమని, భక్తిని ప్రదర్శించాలి.
హిందూ మతం అనేది ఒక జీవన విధానం. ఈ స్ఫూర్తిని మనలో రోజంతా నింపుకుని, ఇతరులు ఉత్తమంగా ప్రవర్తించనప్పటికీ, ఇతరులందరినీ రక్షిస్తామని వాగ్దానం చేసుకుంటాం. ఈ మన ప్రార్థనలు కేవలం హనుమాన్ చాలీసాతో ముగిసిపోవు. ఆయన తన హనుమాన్ చాలీసాకి ప్రసిద్ధులు. హనుమాన్ చాలీసా గానానికి ఆయన స్వరం తిరుగులేని ప్రతిరూపంగా నిలిచింది. రికార్డు చేసిన హనుమాన్ చాలీసా ఒకవేళ మీరు వినాలనుకుంటే, మీరు ఎప్పుడూ గుల్షన్ కుమార్ పాడిన దాన్ని వినండి. హనుమాన్ చాలీసా అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతోంది. ఎందుకంటే, హిందూత్వం అంటేనే సంఘటితతత్వం, ఏకత్వం.
మంగళవారాలు హనుమ ఉపవాసాలు
మంగళవారాన్ని హనుమంతునికి అంకితం చేసిన రోజుగా పరిగణిస్తారు. జీవితంలో సమస్యలని ఎదుర్కొంటున్నవారు, ఆయనపట్ల తమ భక్తిభావాన్ని చాటుకోవడానికి ఆ రోజున ఉపవాసాలు పాటిస్తారు.
సాధారణంగా అందరూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసదీక్షలు చేపడతారు. అంచేత, మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరవాత, గణేషుడిని, హనుమంతుడిని ఆరాధించడం మొదలెట్టాలి. ఎర్రటి వస్త్రాలు ధరించడం, పూజలో ఎర్రటి పుష్పాలు అర్పించడం ద్వారా ఆ రోజుని ప్రత్యేకంగా చేయొచ్చు. హనుమంతుడు తన భక్తులందరి కష్టాలని కడతేర్చి, వారికి మెరుగైన జీవితాల్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.
హనుమాన్ చాలీసా వల్ల ప్రయోజనాలు
విశ్వాసముంచడం, మంచి భక్తులుగా వుండడం, మనల్ని మనం నమ్మడం గురించి హనుమాన్ చాలీసా మనకి బోధిస్తుంది. జీవితం గడ్డుగా గడుస్తుంటే, మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని, మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాడని, మన శక్తిసామర్థ్యాలని మనం తెలుసుకునేలా చేస్తున్నాడని మనం ఎప్పుడూ గుర్తించి విశ్వసించాలి. రూపం, లింగం, దేశం లేదా వేరే వేటి ప్రమేయం లేకుండా ఇతరుల్ని గౌరవించడాన్ని, ప్రపంచంలో మంచితనంలో మనం భాగంకావడాన్ని మనకి హనుమంతుడు బోధిస్తాడు.
Check Hanuman Chalisa in Other Indian Languages
ಹನುಮಾನ್ ಚಾಲೀಸಾ ಸಾಹಿತ್ಯದ ಮಹತ್ವ ಮತ್ತು ಪ್ರಯೋಜನಗಳು (Kannada) |
Click to View More |
हनुमान चालीसा गीत का महत्व और लाभ (Hindi) |
Click to View More |
ಹನುಮಾನ್ ಚಾಲೀಸಾ ಸಾಹಿತ್ಯದ ಮಹತ್ವ ಮತ್ತು ಪ್ರಯೋಜನಗಳು (Telugu) |
Click to View More |
Advantages of Hanuman Chalisa – Teaches us is to have faith, be a good devotee and believe in ourselves |
Click to View More |
હનુમાન ચાલીસાના ગુજરાતી ગીતનો અર્થ (Gujarati) |
Click to View More |
হনুমান চালিসা বাংলা গানের কথার অর্থ (Bengali) |
Click to View More |
हनुमान चालिसाचे मराठीत फायदे (Marathi) |
Click to View More |
മലയാളത്തിലെ ഹനുമാൻ ചാലിസ ഗാനത്തിന്റെ വരികൾ (Malayalam) |
Click to View More |
தமிழில் ஹனுமான் சாலிசா பாடல் வரிகள் (Tamil) |
Click to View More |